రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక భారీ చిత్రం రూపొందనున్న సంగతి విదితమే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. కాగా, ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి అలియా భట్ నటించే అవకాశం వుంది. ప్రస్తుతం ఈ విషయంలో ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయట. కాగా, అలియా ఇప్పటికే చరణ్ సరసన 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa