ఢఖ్ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన జాన్వీ కపూర్.. విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తుంది. ఆ మధ్య వచ్చిన గుంజన్ సక్సేనా లో అందరి చేత తన నటన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఇక రూహి చిత్రంలో రెండు విభిన్న షేడ్స్ ఉన్నపాత్రలో మెస్మరైజ్ చేసింది. ఈ చిత్రంలో ఆమెతో పాటు రాజ్ కుమార్ రావు, వరుణ్ శర్మ నటించారు.
ప్రస్తుతం జాన్వీ కపూర్ 'దోస్తానా 2', 'గుడ్ లక్ జెర్రీ', 'తఖ్త్' వంటి చిత్రాలలో నటిస్తోంది.త్వరలో సౌత్ పరిశ్రమలోకి అడుగుపెట్టనుంది. అయితే జాన్వీ కపూర్ సినిమాల కన్నా కూడా గ్లామర్ షోతో ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. ఇటీవల తన కజిన్ రియా కపూర్ న ప్రియుడు కరణ్ బూలానీని వివాహం చేసుకోగా, ఆ పెళ్లిలో జాన్వీ కపూర్ తెగ సందడి చేసింది. ఆ పెళ్లిలో జాన్వీ దిగిన పిక్స్ వైరల్‌గా మారాయి.
తాజాగా ఎక్స్ పెక్టేషన్ వర్సెస్ రియాలిటీని తనదైన శైలిలో చూపిస్తూ సందడి చేసింది జాన్వీ. ఈ ఫన్నీ వీడియోలో ముందుగా బికినీ ధరించి సులభంగా మెషీన్ నుంచి ఆరెంజ్ జ్యూస్ ను తీస్తోంది. ఇది ఎక్స్ పెక్టేషన్. తరువాత నీలిరంగు టాప్, షార్ట్ ధరించి కన్పించింది. అయితే ఇందులో మాత్రం ఆమె ఆరెంజ్ జ్యూస్ ను తీయడానికి చాలా కష్టపడిపోయింది. ఈ వీడియో నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
Juice shop wali in Karan Johar's #JhanviKapoor pic.twitter.com/TFEg5SOQkP
— Poonendra Pratap Singh (@PPSSbtp) August 22, 2021
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa