నితిన్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లు గా తమన్నా ముఖ్య పాత్రలో నటించిన మాస్ట్రో సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమా ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు కొనుగోలు చేసిందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ చిత్రం ఓటిటి ప్లాట్ ఫాం లోనే విడుదల అవుతుందన్నది ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించే విధంగా తీర్చి దిద్దారు.
అయితే ఈ ట్రైలర్ చూసాక ఈ చిత్రం ఓటిటి లో కంటే థియేటర్ లో చూస్తే బావుంటుందన్న భావన కలుగక మానదు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ను డైరెక్ట్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కాగా నాని హీరోగా నటించిన టక్ జగదీష్ చిత్రాన్ని సైతం సెప్టెంబర్ 10 న ఓటిటి లో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. అదే రోజు శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ థియేటర్ లలో విడుదల అవుతుంది.
దీంతో నాని టక్ జగదీష్ చిత్రం ఓటిటి లో విడుదల చేయడంపై డిస్ట్రిబ్యూటర్ లు, థియేటర్ యజమానులు తీవ్ర నిరసన తెలియజేశారు. హీరో నాని పై విమర్శలు కురిపించారు. నాని సినిమాలని ఏకంగా థియేటర్ లో ప్రదర్శించకుండా బ్యాన్ చేయాలన్నంత వరకూ వచ్చింది వ్యవహారం. మరి ఇదే నితిన్ మాస్ట్రో కి కూడా తగులుతుందని ఫిలింనగర్ లో టాక్ నడుస్తుంది. ఏముతుందో అన్నది చూడాలి.