బాలీవుడ్ భామ దీపిక పదుకొణే త్వరలో పెళ్లి పీటలెక్కనుందా .. అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఈ ఏడాది జనవరి 5న 32 వసంతంలోకి అడుగు పెట్టిన దీపిక పుట్టినరోజు వేడుకను తన ప్రియుడు రణవీర్ సింగ్, అతడి ఫ్యామిలీతో కలిసి శ్రీలకంలో జరుపుకుందనే వార్తలు అప్పట్లో వచ్చాయి. పుట్టినరోజు సందర్భంగా రణవీర్ సింగ్ తల్లిదండ్రులు అంజు భవాని, జగ్జీత్ సింగ్ దీపిక కు ఖరీదైన వజ్రా హారం, సబ్యాసాచి సారీని కూడా గిఫ్టుగా ఇచ్చారట. సాధారణంగా పట్టుచీరలు, హారాలు వంటి గిఫ్ట్స్ తమ ఇంటికి కోడలుగా వచ్చే అమ్మాయికి ఇస్తుంటారు. బయటి వ్యక్తులకు ఎవరూ ఇలాంటి గిఫ్టులు ఇవ్వరు కాబట్టి రణ్ వీర్, దీపిక పదుకునేలు త్వరలో ఒకటి కాబోతున్నారనే వార్తలు గత నెలలో హల్ చల్ చేశాయి. ఇక తాజా సమాచారం ప్రకారం బెంగళూర్‌లో దీపిక తన తల్లి, చెల్లెలితో కలిసి షాపింగ్ చేస్తుందట. బట్టలతో పాటు జ్యూయలరీ షాపింగ్‌తో ఈ ముగ్గురు బిజీ బిజీగా ఉన్నారని సమాచారం. ఈ షాపింగ్ పెళ్ళికి సంబంధించిన షాపింగ్ అని బాలీవుడ్ మీడియా అంటుంది. దీపిక కుటుంబ సభ్యులు కొద్ది రోజుల క్రితం రణ్‌వీర్ ఫ్యామిలీతో పెళ్ళి డేట్ , వేదిక విషయాలు మాట్లాడరని చెబుతున్నారు. ముంబై వర్లీలోని ఫోర్ సీజన్స్‌లో రెండు ఫ్యామిలీలు డిన్నర్ చేస్తూ కనిపించడంతో పెళ్ళిపై అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. ముంబైలోనే వీరిద్దరి పెళ్ళి గ్రాండ్‌గా జరగనుందని సమాచారం. రణ్‌వీర్ ప్రస్తుతం గల్లీబాయ్, సింబా సినిమాలతో బిజీగా ఉండగా, దీపిక విటమిన్ 3డీ లోపం కారణంగా చికిత్స తీసుకుంటుంది. త్వరలో నాగ్పాడాకు చెందిన మాఫియా క్వీన్ రహీమా ఖాన్ జీవితమాధారంగా సినిమా చేయనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa