ప్రముఖ హీరోయిన్ ఆనంది త్వరలోనే తల్లి కాబోతోంది. ప్రస్తుతం ఆమెకు ఆరో నెల అని వార్తలు వస్తున్నాయి. తెలుగుమ్మాయైన ఆనంది తమిళంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో బస్ స్టాప్, ఈ రోజుల్లో, జాంబిరెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్ వంటి సినిమాల్లో ఆనంది నటించింది. ఆనంది హీరోయిన్ గా తెలుగులో సక్సెస్ కాలేకపోయింది. దీంతో, తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించింది.
ఆనంది ఈ ఏడాది జనవరి 7న తమిళ అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్ ను పెద్దల అంగీకారంతో వరంగల్ లో ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె నటించిన రెండు తెలుగు సినిమాలు 'జాంబిరెడ్డి', 'శ్రీదేవి సోడా సెంటర్' ఆమె పెళ్లి తర్వాత విడుదల కావడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa