నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ యంగ్ హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందిని పాత్రతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమాతో నభా నటేష్ క్రేజ్ పెరిగింది. ఈ సినిమా తర్వాత పలు సినిమాలు చేసినా కూడా నభాకి మంచి ఆదరణ దక్కలేదు.ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ రెగ్యులర్ ఫొటో షూట్స్ చేస్తూ అలరిస్తుంటుంది.
కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ నిత్యం బిజీగా ఉండే నభా నటేష్ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది నభా. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో హ్యాండ్ కర్చీఫ్ లాంటి వైట్ టాప్ ధరించి తన అందాలను దాచుకుంది. నభా నటేష్ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa