నితిన్, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా కృష్ణ చైతన్య దర్శకత్వంతో తెరకెక్కిన చిత్రం 'ఛల్ మోహన్ రంగ'. శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగాహాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి హీరో నితిన్ ఎమోషనల్‌గా మాట్లాడారు.నితిన్ మాట్లాడుతూ.... "25 సినిమాలు.. 16 ఏళ్లు.. ఈ జర్నీ రోలర్ కోస్టర్ రైడ్. ఈ జర్నీలో నేను ముందుగా థాంక్స్ చెప్పుకోవాల్సింది కరుణాకరన్‌గారికి, పవన్ కళ్యాణ్‌గారికి. వారి కాంబినేషన్లో వచ్చిన 'తొలిప్రేమ' చూసిన తర్వాతే నేను హీరో కావాలని అనుకున్నాను. తర్వాత నేను థాంక్స్ చెప్పుకోవాల్సింది నా ఫస్ట్ డైరెక్టర్ తేజగారు. నాకు సినిమా ఛాన్స్ ఇచ్చి, నాకు యాక్టింగ్ రాకున్నా కూడా నేర్పించిన మొదటి గురువు. తర్వాత నేను థాంక్స్ చెప్పాల్సింది నా తల్లిదండ్రులకు. నేను సినిమాల్లోకి వెళ్తానంటే వద్దనకుండా నన్ను ఎంకరేజ్ చేశారు. అపుడు వారు 'వీడు సినిమాలకు తప్ప దేనికీ పనికిరాడు' అని అనుకున్నారేమో.... అని నితిన్ వ్యాఖ్యానించారు.ఈ సినిమా నాకు ఎందుకు స్పెషల్ అంటే... ఇది 25వ సినిమా అని కాదు, ఈ సినిమాను నిర్మించింది పవన్ కళ్యాణ్‌గారు, అలాగే త్రివిక్రమ్‌గారు, మా నాన్నగారు. నా జీవితంలో నాకు ఇష్టమైన మొదటి ముగ్గురూ వీళ్లే... అని నితిన్ అన్నారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చాను, అక్కడ నాకు ఒక ప్రశ్న ఎదురైంది. ఒక వేళ నేను ఎవరికైనా అబ్బాయికి సైట్ కొట్టాలంటే ఎవరికి కొడతానంటే త్రివిక్రమ్‌గారికే అని చెప్పాను. ఆయనంటే అంత ప్రేమనాకు... అని నితిన్ తెలిపారు.నేను ఎవరి సినిమాలు చూస్తూ పెరిగానో, ఎవరి సినిమాలు చూసి హీరో అయ్యానో, ఎవరి సినిమాలకు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో బ్యానర్లు కట్టి, బట్టలు చింపుకుని, పేపర్లు ఎగరేసానో, ఎవరిని ఒక్కసారి చూస్తే చాలనుకున్నానో, ఒక్కసారి కలిస్తే చాలనుకున్నానో, ఒక్కసారి ఫోటో దిగితే చాలనుకున్నానో.... ఇవన్నీ చాలా బలంగా అనుకున్నాను, దేవుడి దయవల్ల అన్నీ జరిగాయి. ఈ రోజు నాకు ఇండస్ట్రీలో పెద్ద స్ట్రెంత్ ఎవరంటే... పవన్ కళ్యాణ్‌గారు ఉన్నారు, త్రివిక్రమ్‌గారు ఉన్నారు అని చెబుతాను. వారు నా సినిమాకు నిర్మాత కావడం అనేది నా అదృష్టం. అభిమానుల అందరి అదృష్టం.... అని నితిన్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa