పిల్లల్ని దత్తత తీసుకోవడంలోనే ఎంతో ఆనందం ఉందని అంటున్నారు మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్. ఇప్పటికే సుస్మిత ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకున్నారు. వారికి కావాల్సినవన్నీ అందిస్తూ సొంత తల్లికంటే ఎక్కువగా చూసుకుంటున్నారు.అయితే ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్లినా కొన్ని మీడియా వర్గాలు సుస్మితను పెళ్లి గురించి అడుగుతున్నారట. దీని గురించి ఆమె స్పందిస్తూ.. ‘నేను ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకున్నాను. చాలా మంది దత్తత తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఓ కుటుంబం కావాలంటే రక్త సంబంధమే అవసరం లేదు. ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకుని వారి ఇంటి పేరును జత చేసుకుంటేనే కుటుంబం అవ్వదు. ఈ అభిప్రాయం మారాలి. దేశవ్యాప్తంగా 45 శాతం మంది అనాథలు అనాథాశ్రమాల్లో ఉండటం లేదు. ఎందుకంటే చాలా మంది పిల్లల్ని దత్తత తీసుకుంటున్నారు. ఆ అనుభూతి ఎంత గొప్పగా ఉంటుందో ఆస్వాదిస్తేనే తెలుస్తుంది.’ అని చెప్పుకొచ్చారు సుస్మిత.సినిమాలకు దూరమైన సుస్మిత ప్రస్తుతం ‘వీహెచ్1 ఇన్‌సైడ్ యాక్ట్రెస్’ అనే టీవీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa