ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరోయిన్ల పద్ధతులు మారాయి...

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 26, 2018, 12:28 PM

ఒకప్పుడు ఫలానా హీరోయిన్ ఫలానా వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తోందంటే అనే వార్తలు వస్తే చాలు వెంటనే ఆ విషయం సాధ్యమైనంత రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించేవాళ్లు కథానాయికలు. సినిమాల్లో ఎలా కనిపించినా బయట మాత్రం క్లీన్ యూ ఇమేజ్ సొంతం చేసుకునేందుకు తహతహలాడేవారు. కానీ సోషల్ మీడియా యుగంలో మాత్రం హీరోయిన్ల పద్ధతులు మారాయి.


బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ - విరాట్ కోహ్లీల మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. జంటగా షికార్లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో స్వేచ్ఛగా పంచుకునేవారిద్దరూ. తమ మధ్య ఉన్న ప్రేమను దాచిపెట్టేందుకు ఎప్పుడూ ప్రయత్నించేవాళ్లు కాదు. తర్వాత ప్రేమికులు కాస్తా చెప్పాపెట్టకుండా పెళ్లి చేసుకుని - భార్యాభర్తలుగా మారారు. సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ కూడా అనుష్క శర్మనే ఫాలో అయ్యింది. శ్రియ శరణ్ ఓ రష్యన్ బిజినెస్ మాన్ ఆండ్రూ కొస్చీవ్ తో  ప్రేమాయణం నడిపింది. జోరుగా - హుషారుగా తిరుగుతూ  ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రేమ గురించి - పెళ్లి గురించీ అడిగితే మాత్రం అదేం లేదంటూ... తప్పించుకు తిరిగింది. హఠాత్తుగా పెళ్లి చేసుకుని కనిపించింది. అంతకంటే ముందు విద్యా బాలన్ అండ్ రాణి ముఖర్జీలు కూడా.. తాము ప్రేమించిన ప్రొడ్యూసర్లను ఇదే తరహాలో సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారు.


ఇక డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది నయనతార. తాజాగా అమెరికాలో ప్రియుడితో కలిసి తిరుగుతూ గడిపిన మధురానుభూతులను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది నయన్. అతిత్వరలో ఈ జంట కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది. మొన్నొక ఈవెంట్లో నాకు కాబోయే వాడికి థ్యాంక్స్ అంటూ విఘ్నేష్ గురించి అమ్మడు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తను రూమర్ లా మీడియాకి వ్యాప్తి చేసి ఆ తర్వాత రహస్యంగా పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారట వీరు. ఇదేం కొత్త రకం స్ట్రాటెజీనో మరి. 


కాని మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే.. వీళ్ళెవ్వరూ తమ పెళ్లి వీడియోలను కొందరు స్టారీమణుల తరహాలో మీడియాకు డబ్బుల కోసం అమ్ముకోవట్లేదు. అది సంగతి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa