ఛలో' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన. ఆ తరువాత విజయ్ దేవరకొండతో కలిసి 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో నటించింది. ఆ తరువాత ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్ సరసన 'పుష్ప' సినిమాలో నటిస్తోంది. అలానే బాలీవుడ్ లో మరికొన్ని సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె మరో సినిమా అంగీకరించినట్లు తెలుస్తోంది.
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ సినిమాలో రష్మిక నటించనుందని సమాచారం. స్వప్న సినిమా-వైజయంతీ మూవీస్ సంస్థ దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం కొంతకాలం క్రితం రష్మికను సంప్రదించగా.. ఆమె రీసెంట్ గా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. హనురాఘవపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ మెయిన్ హీరోయిన్ గా కనిపించనుంది. ఆమెతో పాటు సినిమాలో మరో హీరోయిన్ రోల్ ఉందని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa