దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీలో అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రీయా అలాగే విదేశీ నటీనటులు కూడా నటిస్తున్నారు. ఆల్రెడీ అన్ని భాషల్లో కూడా రికార్డు స్థాయి బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం అధికారికంగా ఈ వచ్చే అక్టోబర్ రేస్ నుంచి తప్పుకుంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. అయితే, అక్టోబర్ 22 నుండి థియేటర్లు తిరిగి తెరవడానికి అనుమతిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంతో పెద్ద సినిమాలు తమ రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది . ఇప్పటికే 2022 సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa