బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఆచార్య” . ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. మరి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మెగా మల్టీ స్టారర్ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నో అంచనాలు నెలకొల్పుకుని ఉన్న ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడు అనేది ఎప్పుడు నుంచో సందిగ్ధంలో ఉన్న ప్రశ్న. దీనితో ఇది కాస్తా మిస్టరీ గానే మిగిలిపోయింది. అయితే సినీ వర్గాల్లో మాత్రం ఈ సినిమా దాదాపు సంక్రాంతి రేస్ లోనే ఫిక్స్ అయ్యింది అని టాక్ ఉంది. కానీ ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం ఆచార్య ఈ రేస్ నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇదెప్పుడు వస్తుంది అన్నదానికి క్రిస్మస్ రేస్ లో బహుశా ఈ సినిమా రావొచ్చని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో అన్నది చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa