మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా 'భోళా శంకర్' . ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకుడు. నవంబర్ 11న ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లుగా నిర్మాణ సంస్థ అధికారిక ట్విట్టర్ పేజీలో షేర్ చేయడం జరిగింది. ఆ వెంటనే అంటే 15 వ తారీకు నుండి షూటింగ్ కు వెళ్లబోతున్నారు. ఈ సినిమా లో చిరంజీవికి చెల్లి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నరు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న భోళా శంకర్ సినిమా లో హీరోయిన్ ఎవరు అనే విసయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సినిమా లో చిరంజీవి మరియు కీర్తి సురేష్ ల బాండింగ్ గురించి చాలా ముచ్చట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి భోళా శంకర్ సినిమా పట్టాలెక్కే అవకాశాలు పక్కా అని తేలిపోయింది. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన అజిత్ వేదాళం కు రీమేక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa