ఏపీ రాష్ట్ర మంత్రి వర్యులు పేర్ని నాని తో టాలీవుడ్ సినీ నిర్మాత దిల్ రాజు సచి వాలయం లో భేటీ అయ్యారు , అలంకార్ ప్రసాద్, పలువురు ఇతర నిర్మాతలు, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు సమావేశమయ్యారు. నిన్నటి ఏపీ క్యాబినెట్ లో ఆల్ లైన్ లో సినిమా టికెట్ల విక్రయాల అంశం పై సినిమాటోగ్రఫీ చట్ట సవరణ కోసం చర్చ జరిగింది.దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఏపీ నిర్ణయం పై టాలీవుడ్ ప్రముఖుల అభిప్రాయాలను ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని తెలుసుకోనున్నారు. వారి అభిప్రాయాల అనంతరం ఆన్ లైన్ టికెట్ల విధానం పై ఫైనల్ నిర్ణయం తీసుకోనుంది ఏపీ సర్కార్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa