‘రంగస్థలం’ విజయోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా పాల్గొన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ‘‘ఒక పల్లెటూరి వాతావరణంలో సినిమా చేస్తున్నారు, కొత్తగా చేస్తున్నారు.. ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి అని బలంగా కోరుకునేవాడిని. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోట్ల మంది ప్రేక్షకుల వలే నేను కూడా ఆకాంక్షించాను. అలాగే సుకుమార్ గారు కథని రాసుకున్న తీరు, నడిసిన తీరు, డైలాగ్స్ ఎంత సహజత్వానికి దగ్గరగా ఉన్నాయంటే.. సినిమాలో చేస్తున్న వారు పాత్రదారులు నటిస్తున్నారు అనిపించలేదు.. సహజత్వంగా అనిపించాయి.
మొన్న ప్రీమియర్ చూసి వస్తున్నప్పుడు పక్కనే అనసూయగారు వస్తుంటే మాములుగా షేక్ హ్యాండ్ ఇచ్చాను. నేనే అత్త పాత్ర చేశానంటే.. అప్పుడు మళ్లీ తిరిగి చూశాను. ఓహో ఈవిడా అని. అలాగే జగపతిబాబుగారు. చెన్నైలో ఉన్నప్పటి నుంచి తెలుసు. ఆయన హీరోగా చేయను. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తానని ముందుకు వచ్చినప్పుడు.. ఆయనలో ఉన్న నటుడికి తార్కాణం ఈ రంగస్థలంలోని ఆయన ప్రెసిడెంట్ పాత్ర. అలాగే ఆది పాత్ర కూడా. అలాగే చరణ్ పక్కన ఉన్న నటీనటులు చాలా బాగా చేశారు.
సమంతగారు ఇక సినిమాలు చేయదేమో అనుకున్నప్పుడు ఈ సినిమా చేయడం సంతోషం కలిగించింది. సమంతగారిని రామలక్ష్మిగా చూస్తుంటే నాకు చాలా ఆనందం కలిగింది. అద్భుతంగా నటించారు. జబర్థస్త్‌లో చేసే నటులు ఇందులో చాలా బాగా చేశారు. అలాగే రత్నవేలుగారి ఫొటోగ్రపీ అంటే నాకు చాలా ఇష్టం. దేవిశ్రీ మ్యూజిక్, చంద్రబోస్ సాహిత్యం అంటే చాలా ఇష్టం. కొరియోగ్రాఫర్స్‌కి, ఫైట్ మాస్టర్స్‌కి, నిర్మాతలకి ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలుపుతున్నాను..’’ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa