ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీదేవి చనిపోవడానికి కొన్ని గంటల ముందు..

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 14, 2018, 09:29 AM

శ్రీదేవి భారతీయ సినీ చరిత్రలోనే ఆల్ టైం గ్రేట్ హీరోయిన్. మనీష్ మల్హోత్రా ఇండియాలో నంబర్ వన్ ఫ్యాషన్ డిజైనర్. వీళ్లిద్దరిదీ దాదాపు 3 దశాబ్దాల అనుబందం. శ్రీదేవి బాలీవుడ్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఆమె కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నది మనీషే. శ్రీదేవి సినిమాల నుంచి నిష్క్రమించాక కూడా ఆమెకు వ్యక్తిగత కాస్ట్యూమ్ డిజైనర్ గా కొనసాగుతున్నాడు మనీష్. శ్రీదేవికి అతను చాలా సన్నిహితుడు. ఫ్యామిలీ ఫ్రెండ్. తన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన శ్రీదేవి హఠాత్తుగా చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నానని.. ఆమె చనిపోయిందన్న వాస్తవం ఇంకా నమ్మలేకపోతున్నానని మనీష్ చెప్పాడు. ఇప్పటికీ డ్రెస్ డిజైన్ కోసం శ్రీదేవి ఫోన్ చేస్తుందేమో అని తాను ఎదురు చూస్తూనే ఉన్నానని అతను చెప్పాడు.


తాను శ్రీదేవి ఎప్పుడూ దుస్తులు.. తిండి.. సినిమాల గురించే మాట్లాడుకునే వాళ్లమని.. ఆమె ఒకరి గురించి చెడుగా మాట్లాడటం ఇన్నేళ్ల స్నేహంలో ఎప్పుడూ చూడలేదని మనీష్ అన్నాడు. తనకు ఇంత ఆప్తురాలైన స్నేహితురాలు ఎవరూ తనకు ఇలా దూరం కాలేదని చెప్పాడు. శ్రీదేవి ఇప్పటికీ ఏ వేడుకకు వెళ్లాలన్నా తానే డ్రెస్ డిజైన్ చేయాలని.. ఆమె చనిపోవడానికి కొన్ని గంటల ముందు కూడా తనకు ఫోన్ చేసిందని.. తన పెద్ద కూతురు జాన్వి తొలి సినిమా గురించి తనతో మాట్లాడిందని.. అంతలోనే ఆమె మరణ వార్త గురించి వినాల్సి వస్తుందని ఊహించలేదని మనీష్ ఆవేదన వ్యక్తం చేశాడు. జాన్వికి కూడా తానే డిజైనర్ అని.. శ్రీదేవి లాగే తనతోనూ లాంగ్ జర్నీ ఉంటుందని ఆశిస్తున్నానని మనీస్ చెప్పాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa