ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్ఆర్ఆర్ నుంచి జనని వీడియో సాంగ్..!

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 26, 2021, 04:32 PM

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల కలయికలో తెరకెక్కుతున్న భారీ సినిమా 'ఆర్ఆర్ఆర్' కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది గ్రాండ్‌గా విడుదల కానుంది. చిత్ర యూనిట్ కూడా చిత్రం నుంచి మంచి అప్ డేట్స్ ఇస్తోంది. ఇటీవ‌ల విడుద‌లైన సెకండ్ సాంగ్‌కి భారీ రెస్పాన్స్ వ‌స్తోంది. ప్రస్తుతం ఈ సినిమా అదిరే ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. అయితే ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జనని వీడియో సాంగ్ ఎట్టకేలకు విడుదలైంది. ప్రకటించిన సమయానికి గంట ముందు, వీడియో సాంగ్ వివిధ భాషలలో భారతీయులను పలకరించింది. ఈ వీడియోలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ నటిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించడంతో పాటు పాటకు స్వరాలు జోడించారు. వరుణ్ గ్రోవర్ ఈ పాటకు సాహిత్యం రాశారు. 






 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa