నందమూరి బాల కృష్ణ నటించిన అఖండ సినిమా మంచి ఆదాయం పొందిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఐతే తన తదుపరి సినిమాగా దర్శకుడు గోపీచంద్ మలినేని తో సినిమా అని ప్రకటించడం జరిగింది. `క్రాక్` సినిమాతో గోపీచంద్ మలినేని మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని, బాలకృష్ణ కలయికలో మాస్ ఎంటర్టైనర్ ని మైత్రీ మూవీ మేకర్స్ చేయబోతోంది. ఇప్పటికే ఈ మూవీ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా వుంది. శృతిహాసన్ ఈ మూవీలో బాలయ్యకు జోడీగా నటిస్తోంది. `క్రాక్`లో విలన్ పాత్రను పవర్ ఫుల్ గా చూపించిన గోపీచంద్ మలినేని తాజా చిత్రంలోనూ అంతకు మించిన పవర్ ఫుల్ విలన్ పాత్రని డిజైన్ చేశారట. ఈ పాత్ర కోసం కన్నడ స్టార్ `దునియా` విజయ్ ని ఫైనల్ చేశారు. గత కొంత కాలంగా తెలుగులో పరిచయం కావాలని ఎదురుచూస్తున్న `దునియా` విజయ్ కి పర్ఫెక్ట్ మూవీ కాబోతోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రిషి పంజాబీ ఛాయాగ్రహకుడిగా వ్యవహరిస్తున్నారు.ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కాబోతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa