తెలుగులో 'బోళాశంకర్', 'సర్కారు వారి పాట', . తమిళంలో 'సాని కాయిదమ్', మలయాళంలో 'వాషి' . ఇలా సాలో ఫుల్ బిజీగా ఉన్నారు. హీరోయిన్ కీర్తీ సురేష్. తాజాగా ఈ మలయాళ బ్యూటీ మరో తమిళ సినిమాకు గ్రీన్ - సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ టాక్. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న ఈ సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు కీర్తీ సురేష్ ను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అంతేకాదు.. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa