చియాన్ విక్రమ్, ధృవ్ విక్రమ్ హీరోలుగా మొదటిసారిగా చిత్రంలో కలిసి నటిస్తున్న సినిమా 'మహాన్'. ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజ్ రచన మరియు దర్శకత్వం వహించాడు. తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న నేరుగా ఓటీటీలో మహాన్‌ను విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. మహాన్‌లో సిమ్రాన్, వాణి భోజన్, బాబీ సింహా మరియు సనంత్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa