ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా 'సర్కారువారి పాట' సినిమా రూపొందుతోంది. మైత్రీ మరియు 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలా షూటింగ్ జరుపుకుంది. మోకాలి శస్త్రచికిత్స కారణంగా మహేష్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.
వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. జనవరి 13న రాబోతున్నట్లు కూడా ప్రకటించారు. ఆ తర్వాత ‘RRR’ వస్తుందని తెలిసి ఏప్రిల్ 1కి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు సంక్రాంతికి ఓ అప్‌డేట్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ కూడా ధృవీకరించారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టి సంక్రాంతి కానుకగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. బ్యాంకు కుంభకోణం చుట్టూ సాగే ఈ కథలో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. వెన్నెల కిషోర్ ఒక ముఖ్యమైన పాత్రలో సందడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa