సమంత ప్రధాన పాత్రలో 'యశోద' చిత్రం రూపొందుతోంది. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. హరి - హరీష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా ఈ చిత్రం రెండో షెడ్యూల్ షూటింగ్‌కు సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసారు. ఈ షెడ్యూల్‌లో ప్రధాన పాత్రలకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇవి సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని చిత్రబృందం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa