మల్లిక్ రామ్ దర్శకత్వం లో తేజ సజ్జ హీరోగా, శివాని రాజశేఖర్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం "అద్బుతం". డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ చిత్రాన్ని డిజిటల్‌గా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సినీ పరిశ్రమలోని ప్రముఖులు, ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది. బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు ఈ చిత్రం సంక్రాంతికి రాబోతోంది. స్టార్ మా మూవీస్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా రాబోతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa