ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాయిధరమ్‌ కొత్త సినిమా ప్రారంభం

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2017, 03:38 PM

హైదరాబాద్‌: సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. సి. కల్యాణ్‌ నిర్మాత. ఈ చిత్రం షూటింగ్‌ బుధవారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్‌ కొట్టారు. మెగాస్టార్‌ చిరంజీవి ఆశీర్వాదాలతో సినిమాను ప్రారంభించినట్లు చిత్ర బృందం పేర్కొంది.


సాయిధరమ్‌ నటించిన ‘నక్షత్రం’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కృష్ణ వంశీ దర్శకుడు. ఈ చిత్రంలో ఆయన అలెగ్జాండర్‌ పాత్రలో పోలీసు అధికారిగా కనిపించారు. ప్రస్తుతం సాయిధరమ్‌ ‘జవాన్‌’ చిత్రంలో నటిస్తున్నారు. బి.వి.ఎస్‌. రవి దర్శకుడు. సెప్టెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa