రంజిత్ జయకోడి దర్శకత్వంలో టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం మైఖేల్. భరత్ చౌదరి, రామ్మోహన్ రావు, నారాయణదాస్ నారంగ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో దివ్యాన్షు కౌశిక్ హీరోయిన్గా నటిస్తున్నారు. యాక్షన్ ఎంటెర్టైనెర్జ్ తెరకెక్కుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ శనివారం హైద్రాబాద్లో ప్రారంభమైంది.
చాలా కాలం క్రితం హీరో నాని నిర్మించిన డి ఫర్ దోపిడీ అనే చిత్రంలో కలిసి నటించిన సందీప్ కిషన్, వరుణ్ సందేశ్ మళ్ళీ ఈ చిత్రంలో కలిసి నటించనున్నారు. మైఖేల్ లో ఒక ప్రత్యేక పాత్ర కోసం వరుణ్ సందేశ్ను ఎంపిక చేసినట్లు చిత్రబృందం తెలిపింది. దీనికి సంబంధించి ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్గా నటిస్తున్న ఈ మూవీలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంతటి ప్రత్యేకతలతో కూడిన ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఏక కాలంలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa