ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమల్ తెలుగు డబ్బింగ్ రైట్స్ అన్ని కోట్లా?

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 12, 2022, 01:23 PM

లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న చిత్రం విక్రం. కమల్ తన సొంత బ్యానర్లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటుంది. 


కమల్ హాసన్ కి తమిళ చిత్ర సీమలో ఎంతటి స్టార్డం ఉంటుందో తెలిసిందే. తెలుగులో కూడా కమల్ కు మంచి గుర్తింపు, క్రేజ్ ఉండటంతో ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ 11 కోట్ల భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. కమల్ హాసన్ కి లోకేష్ కనగరాజన్ ఇమేజ్ కూడా తోడవటంతో ఇంత భారీ స్థాయి రేటుకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసారని అంటున్నారు. ఇంకా ఈ సినిమాలో కమల్ తో పాటు విజయ్ సేతుపతి,ఫాహద్ ఫాజిల్ నటిస్తుండటం కూడా మరో కారణమని చెప్పుకుంటున్నారు. మార్చి 14వ తేదీన ఉదయం 7 గంటలకు ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa