బుల్లి తెర స్టార్ యాంకర్ అనసూయ కొంచెం కొత్తగా ట్రై చేస్తుంది.. ఈ సారి జయ శంకర్ అనే దర్శకుడు తెరకెక్కించబోతున్న ఓ సినిమాలో అనసూయ కామెడీ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్‌గా ఈ మూవీ వస్తున్నట్లు తెలిసింది. కీలకపాత్రల్లో శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్రలు నటించబోతున్నారట. లేడీ లీడ్ రోల్‌ను అనసూయ చేస్తోందని సమాచారం. దీంతో ఆమె ప్రేక్షకులను ఏవిధంగా నవ్విస్తుందో అని సినిమాపై ఆసక్తి నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa