భారీ పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' కు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చారని రాజమౌళి మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చాడు. తెలంగాణలోనూ దీనికి పర్మిషన్ ఇచ్చారన్నాడు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 5 షోలు రన్ కానున్నాయి. కలెక్షన్లు భారీగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఏపీలో టికెట్ రేట్లను అదనంగా రూ.100 పెంచుకునేందుకు సర్కారు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa