“మా `ఆర్ ఎక్స్ 100`టీజర్‌కి యూట్యూబ్‌లో ఆరు లక్షల వ్యూస్ వచ్చాయి. ఓ చిన్న చిత్రం టీజర్‌కి ఇన్ని వ్యూస్ రావడం అరుదైన విషయం. టీజర్ విడుదలైనప్పటి నుంచి బిజినెస్ వర్గాల్లోనూ మా సినిమాకు క్రేజ్ అమితంగా పెరిగింది“ అని అంటున్నారుఈ మూవీ నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మకొండ. కె సి డబ్ల్యు బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్నచిత్రం `ఆర్ ఎక్స్ 100`. ఈ చిత్రానికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. An Incredible Love Story అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. కార్తికేయ, పాయల్ రాజపుత్ హీరోహీరోయిన్లు. రావురమేష్, సింధూర పువ్వు రామ్‌కీ ఇందులో కీలక పాత్రధారులు.
ఈ చిత్ర విశేషాలను గురించి దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ “ఓ చిన్న టౌన్ నేపథ్యంలో కథ నడుస్తుంది. రియలిస్టిక్ లవ్ స్టోరీ ఇది. ఆర్ ఎక్స్ 100 బైక్ సౌండ్‌లోనే తెలియని పొగరు ఉంటుంది. మా హీరో శివ పాత్ర కూడా అలాగే ఉంటుంది. ఒక రకమైన నిర్లక్ష్య ధోరణితో సాగే పాత్ర అతనిది. తెలుగులో ఇలాంటి ప్రేమకథ ఇప్పటివరకూ రాలేదు. అన్ని వర్గాల ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. చిన్న చిత్రం టీజర్‌కి ఆరు లక్షల ఆర్గానిక్ వ్యూస్ రావడమంటే తేలికైన విషయం కాదు. మా టీజర్‌ను అంతలా ఆదరించిన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సినిమా కూడా అంతకు వెయ్యి రెట్లు మెప్పిస్తుంది“ అని చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ “టీజర్ విడుదలైనప్పటి నుంచి బిజినెస్ వర్గాల్లో మా సినిమాకు అమాంతం క్రేజ్ పెరిగింది. యువతకు టీజర్ చాలా బాగా నచ్చింది. వాళ్లను మెప్పించే అంశాలన్నీ ఉన్నాయి. కేవలం యువతకే కాదు, అన్ని వర్గాలవారినీ ఆకట్టుకుంటుందీ చిత్రం. కథకు సరిపోయే టైటిల్‌ని పెట్టాం. ఆత్రేయపురం పరిసరాల అందాలను కెమెరాలో బంధించాం. ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోంది. జులై 5న చిత్రాన్ని విడుదల చేస్తాం. నాయికానాయకులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు“ అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa