ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూవీ రివ్యూ: ‘జేమ్స్’

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 17, 2022, 12:02 PM

కర్నాటకలో ఎన్నలేని విధంగా 500 పైగా స్క్రీన్స్‌, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 250 కి పైగా స్క్రీన్స్‌ ప్రపంచ వ్యాప్తంగా 4 వేలకు పైగా స్క్రీన్స్‌ లో ఈ సినిమాను విడుదల చేశారు. పైగా ఈ రోజు పునీత్‌ జయంతి కావడంతో జనాలు సినిమా చూడటానికి ఎగబడుతున్నారు. మరో వైపు చిరంజీవి, మోహన్‌ లాల్‌ లాంటి హీరోలు కూడా జేమ్స్‌ సినిమా విజయం సాధించడమే పునీత్‌ కు మన ఇచ్చే ఘనమైన నివాళి అంటూ ట్వీట్స్‌ ఇప్పటి కే చేశారు.
జేమ్స్ ఒక కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా చెప్పుకోవచ్చు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇందులో జె వింగ్స్ సీక్రెట్ గవర్నమెంట్ ఏజెన్సీ ఆఫీసర్ సంతోష్ జేమ్స్ కుమార్ పాత్రలో నటించారు. మూవీలో ప్రత్యేకత ఏమిటి అంటే పునీత్ రాజ్ కుమార్ అన్ని శివరాజ్ కుమార్ ఈ సినిమాకు వాయిస్ అందించారు. ప్రియా ఆనంద్ జేమ్స్ లవర్ నిషా గయక్వాడ్ పాత్రలో నటించింది. బ్లాక్ మార్కెట్, కరప్షన్, స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోతాయి. వీటిని ఎదుర్కొనడానికి ప్రభుత్వంలోని పోలీస్ రక్షణ వ్యవస్తలో జేమ్స్ వింగ్ అనే ఓ సీక్రెట్ ఏజెన్సీ రన్ అవుతుంది. ఈ సీక్రెట్ ఎజెన్సీని జేమ్స్ కుమార్ (పునీత్ రాజ్ కుమార్) లీడ్ చేస్తాడు. కథ మొత్తం దీని చుట్టే తిరుగుతూ ఉంటుంది.
చేతన్ కుమార్ ఈ సినిమాకు కథ అందించడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. పునీత్ రాజ్ కుమార్, ప్రియా ఆనంద్ ప్రధాన పాత్రలో నటించారు. అను ప్రభాకర్, శ్రీకాంత్, ఆర్.శరత్ కుమార్, హరీష్ పేరడి, తిలక్ శేఖర్, ముఖేశ్ రిషి, ఆదిత్య మీనన్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. కిశోర్ పత్తికొండ ఈ మూవీని కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. చరణ్ రాజ్ సంగీతాన్ని సమకూర్చగా, స్వామి జె గౌడా సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు, దీపు ఎస్ కుమార్ ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు.
ఇండియన్ మూవీ లవర్, పునీత్ రాజ్ కుమార్ అభిమానులు తప్పకుండా చూడాల్సిన సినిమా జేమ్స్. పునీత్ పర్ఫామెన్స్, యాక్షన్, డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పునీత్ రాజ్ కుమార్ ఒక నటుడు మాత్రమే కాదు ఒ మంచి సామాజిక సేవకుడు కూడా తన చారిటీ ఆర్గనైజేషన్లతో ఎంతో మందికి ఎన్నో సేవలను అందించాడు. ఈ సినిమాలో పునీత్ కు తన అన్న శివకుమార్ వాయిస్ ను అందించడం ఒక హైలైట్. జేమ్స్ తప్పకుండా ప్రతీ భారతీయుడు చూడాల్సిన మూవీ.
రేటింగ్ : 3.5 / 5






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa