సౌత్ ఇండియాలో 'KGF1' సినిమా ఒక సెన్సేషన్ ని సృష్టించింది.ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ హీరో గా నటించాడు.ఇప్పుడు అందరూ "KGF2" కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.శ్రీనిధి శెట్టి ఈ సినిమా హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ సినిమాలో సంజయ్ దత్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు.ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది అని మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు.తాజా రిపోర్ట్స్ ప్రకారం,'KGF2' సినిమా OTT స్ట్రీమింగ్ భాగస్వామిని లాక్ చేసినట్లుగా సమాచారం.ZEE గ్రూప్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ భాగస్వామి అని వార్తలు వినిపిస్తున్నాయి.'KGF2' సినిమా సౌత్ ఇండియన్ భాషా వెర్షన్‌లు థియేట్రికల్ రిలీజ్ తర్వాత ZEE5లో అందుబాటులోకి వస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa