ప్రముఖ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రేమకథతో సినిమా రూపొందనుందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. చదువుకునే రోజుల్లో ఆయనకొక ప్రేమకథ ఉండేదట. ఆ ప్రేమకథను రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. ఇప్పటికే ఆమె మరాఠీ, భోజపురి, బెంగాలీ భాషల్లో పలు చిత్రాలు నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా ‘నళిని’ టైటిల్‌తో ఇంగ్లిష్, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ వయసులో ఉన్నప్పటి నుంచీ, స్ఫూర్తిదాయకమైన ఆయన ప్రేమకథ, శాంతినికేతన్ ఆశ్రమం తదితర అంశాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న ఉజ్వల్ చటర్జీ తెలిపారు. ‘‘మంచి కథల్ని ప్రేక్షకులకు చెప్పాలనే తపనతో ప్రియాంక ఉంది. ‘నళిని’ పొటెన్షియల్‌తోపాటు చక్కని వినోదం ఉన్న కథ. రెండేళ్లగా దీనిపై రీసెర్చ్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్‌తో అసోసియేట్ అయినందుకు ఆనందంగా ఉంది’’ అని ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa