రాజమౌళి డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'RRR' సినిమా ఈ నెల 25న గ్రాండ్ రిలీజ్ కానుంది.బాలీవుడ్ బ్యూటీ క్వీన్ అలియా భట్ ఈ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది.ఈ సినిమాలో అలియా,రామ్ చరణ్ సరసన నటిస్తోంది.రాజమౌళి చరణ్ అండ్ అలియా భట్‌లపై అందమైన రొమాంటిక్ టాక్ ని రూపొందించాడని వార్తలు వినిపిస్తున్నాయి.మేకర్స్ ఇంకా ప్రోమోని రిలీజ్ చేయలేదు.అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,రాజమౌళి ఈ విషయాన్ని చాలాసీక్రెట్ గా ఉంచారని సినిమా విడుదలయ్యాక మాత్రమే వెల్లడిస్తారని లేటెస్ట్ టాక్.ఈ సినిమాలో రామ్ చరణ్ పోలీస్ గా కనిపించనున్నాడు.అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.MM కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు .హిందీ,తమిళం,మలయాళం అండ్ కన్నడ భాషలలో కూడా ఈ సినిమా విడుదల కానుంది.డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa