నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి 'వీరసింహా రెడ్డి' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ లుక్‌తో కనిపించనున్నాడు. ఈ సినిమాలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి. ఆయన పాత్రను పరిచయం చేస్తూ బుధవారం పోస్టర్‌ను విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa