టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో కిరణ్ అబ్బవరం ఒక్కరు.ఈ హీరో ప్రస్తుతం రొమాంటిక్ లవ్ స్టోరీ ట్రాక్ లో రానున్న 'సమ్మతమే' సినిమాలో కనిపించనున్నారు.చాందిని చౌదరి ఈ సినిమాలో కిరణ్ సరసన జంటగా నటిస్తోంది.గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి కొత్త పాటను మేకర్స్ విడుదల చేశారు.'బుల్లెట్ లా' అనే టైటిల్ తో వచ్చిన ఈ పాటను శేఖర్ చంద్ర కంపోజ్ చేయగా,రితేష్ జి రావ్ పాడారు.యుజి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa