'భీమ్లానాయక్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తమిళ హిట్ సినిమా 'వినోదయ సీతం' రీమేక్ చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడని ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.సముద్రకని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,ఈ సినిమా షూటింగ్ ఈ నెల 24న హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని అని సమాచారం.అందుకు సంబంధించిన పనులను మేకర్స్ చేస్తున్నట్లుగా లేటెస్ట్ టాక్.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ZEE5తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది.ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa