భారీ అంచనాలతో వచ్చిన రాధే శ్యామ్ చిత్రం హిందీలో మాత్రం జోరు ప్రదర్శించడంలేదు. భాస్ - పూజ హెగ్డే జంటగా 'రాధే శ్యామ్' రూపొందింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఇదే రోజున ఈ సినిమాను విడుదల చేశారు. తొలి రోజునే ఈ సినిమా మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. హీరో - హీరోయిన్ కి సంబంధించిన సన్నివేశాలపైనే పూర్తి ఫోకస్ పెట్టారనే విమర్శలు వచ్చాయి. తొలి రోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 79 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 3 రోజుల్లో 151 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఆ తరువాత మాత్రం ఈ సినిమా జోరు తగ్గడం మొదలుపెట్టింది. గతంలో ప్రభాస్ నుంచి వచ్చిన 'బాహుబలి' .. 'బాహుబలి 2' 'సాహో' సినిమాలు హిందీలో భారీ వసూళ్లను సాధించాయి. దాంతో ఈ సినిమా కూడా హిందీలో లాంగ్ రన్ లో 100 కోట్ల వరకూ వసూలు చేయవచ్చని అనుకున్నారు. అయితే హిందీ వెర్షన్ విషయంలో అంచనాలు మరీ తలక్రిందులయ్యాయి. లాంగ్ రన్ లో ఈ సినిమా అక్కడ 20 కోట్లకి మించి వసూలు చేయకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa