జేమ్స్(పునీత్ రాజ్‌కుమార్):-కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గత ఏడాది అక్టోబర్ నెలలో మరణించారు.అయన నటించిన చివరి సినిమా 'జేమ్స్' 17 మార్చి 2022న విడుదలైంది.చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పునీత్ సరసన ప్రియా ఆనంద్ జోడిగా నటించింది.
జీరో(శ్రీదేవి):-ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన 'జీరో' సినిమా 2018లో విడుదలైంది.ఈ చిత్రంలో అనుష్క శర్మ,కత్రినా కైఫ్ అండ్ షారుక్ ఖాన్ నటించారు.శ్రీదేవి 24 ఫిబ్రవరి 2018న మరణించారు.ఆమె చనిపోయిన తర్వాత ఈ సినిమా విడుదలైంది.
ఆమె ఎవరు(ఆర్తి అగర్వాల్):-ఆర్తీ అగర్వాల్,చలపతి రావు అండ్ ధనరాజ్ నటించిన 'ఆమె ఎవరు' సినిమా 2016లో విడుదలైంది.ఆమె 6 జూన్ 2015న మరణించింది.
మనం(ANR):-ఫ్యామిలీ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాని విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసారు.22 జనవరి 2014న 90 ఏళ్ల వయసులో లెజెండరీ యాక్టర్ ANR మరణించిన తర్వాత ఈ చిత్రం విడుదలైంది.
ఆప్తరక్షక (విష్ణువర్ధన్):-కన్నడ స్టార్ హీరో విష్ణువర్ధన్ నటించిన 'ఆపత్రరక్షక' చిత్రం 2010లో విడుదలైంది.30 డిసెంబర్ 2009న విష్ణు వర్ధన్ మైసూర్‌లో గుండెపోటుతో మరణించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa