కన్నడ హీరో సుదీప్ సరసన నటించే అవకాశాన్ని వర్ధమాన హీరోయిన్ మడోన్నా సెబాస్టీయన్ కొట్టేసింది.. గతంలో ఈ హీరో కోటిగొబ్బ పేరుతో వరుసగా రెండు మూవీలు తీశాడు.. తాజాగా ఈ మూవీకి మూడో సీక్వెల్ షూటింగ్ ను ప్రారంభించారు.. ఈ మూవీ కోసం మడొన్నాను తీసుకున్నారు..మలయాళ ‘ప్రేమమ్’తో మంచి మార్కులు కొట్టేసిన మడోన్నా ఆ తరువాత తమిళ సినిమాలతో బిజీ అయింది. కన్నడలో సుదీప్ జోడీగా ఛాన్స్ దక్కడం పట్ల ఆమె చాలా హ్యాపీగా ఫీలవుతోంది. యూరప్ లోని సెర్బియాలో ఈ నెల 16 నుంచి ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలుకానుంది. తొలిసారిగా అక్కడ షూటింగ్ జరుపుకుంటోన్న తొలి కన్నడ చిత్రం ఇదే కావడం విశేషం. 40 రోజుల పాటు అక్కడ ప్రధాన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa