సినిమా ఫలితాలపై ఆధ్యాత్మిక ధోరణీలో మాట్లాడింది హీరోయిన్ పూజా హెగ్డే. సినీ పరిశ్రమలో పూజ హెగ్డే ఈ మధ్య కాలంలో వరుస విజయాలను అందుకుంటూ వెళుతోంది. ఒక రకంగా టాలీవుడ్లో ఆమె నెంబర్ వన్ పొజిషన్లో ఉంది. గోల్డెన్ లెగ్ అనిపించుకున్న కారణంగా ఆమె నటించిన 'రాధే శ్యామ్' కూడా భారీ విజయాన్ని సాధించడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిని అందుకోలేకపోయింది. తొలి రోజున 79 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, మూడు రోజుల్లో 151 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. వీకెండ్ తరువాత ఈ సినిమా గ్రాఫ్ అన్ని ప్రాంతాల్లో తగ్గుతూ వెళ్లింది. హీరో .. హీరోయిన్ పాత్రలపై మాత్రమే ఫోకస్ చేసి .. మిగతా పాత్రలను పట్టించుకోలేదనే విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో పూజ హెగ్డే మాట్లాడుతూ .. "కొన్ని సినిమాలు ఓకే అనిపించినా బాక్సాఫీస్ దగ్గర బాగా పెర్ఫార్మ్ చేస్తాయి. మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బాగా పెర్ఫార్మ్ చేయకపోయినా అవి బాగానే అనిపిస్తాయి. ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది ముందుగానే రాసి పెట్టి ఉంటుంది .. అలాగే జరుగుతుంది .. అంతే" అంటూ తేల్చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa