రామ్‌చరణ్, తారక్ కలిసి ఓ మల్టీస్టారర్‌కు సంతకం చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ‘బాహుబలి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత తెరకెక్కించనున్న చిత్రమిది. ‘#RRR’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఇటీవల సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాలో చరణ్, తారక్ పాత్రల గురించి అనేక వదంతులు వెలువడుతున్నాయి.ఇది పక్కన పెడితే చరణ్, తారక్ మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఇటీవల తారక్ పెళ్లి రోజు సందర్భంగా చరణ్ దంపతులు ఆయన ఇంటికి వెళ్లి, వేడుకలో పాల్గొని, సందడి చేశారు. తాజాగా తారక్ తన సహ నటుడు చరణ్ ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు. అందులో చెర్రీ పక్కన తారక్ తాతయ్య నందమూరి తారక రామారావు ఫొటో ఉంది. చరణ్ లెజెండెరీ ఆలోచనల్లో ఉన్నారని తారక్ ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ అరుదైన ఫొటో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. అంతేకాదు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
తారక్ ప్రస్తుతం ‘అరవింద సమేతా..’ సినిమాలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. చరణ్ ‘రంగస్థలం’ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నారు. ఇందులో కైరా అడ్వాణీ కథానాయిక.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa