SSరాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'RRR'లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసందే.ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది.మార్చి 27న ఈ మెగా హీరో బర్త్ డే స్పెషల్ గా అతని అభిమానులు ఈ స్టార్ హీరో పుట్టినరోజును ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు.అందులో భాగంగా హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో రామ్‌చరణ్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించాలని రామ్‌చరణ్ యువశక్తి నిర్ణయించింది.ఈ ఈవెంట్ మార్చి 27,2022న సాయంత్రం 04:32గంటల నుండి జరుగుతుంది.శ్రేయాస్ గ్రూప్ ఈ ఈవెంట్ ని నిర్వహిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa