'ఎటాక్' ట్రైలర్ లాంచ్ లో జాక్వెలిన్ మెరుపులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రకుల్ ప్రీత్ సింగ్, జాన్ అబ్రహం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ సినిమా 'ఎటాక్'. లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఏప్రిల్ 1న 'ఎటాక్' ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైట్ అండ్ వైట్ లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సందడి చేసింది. మరో హీరోయిన్ రకుల్ ట్రెండీ లుక్ లో దర్శనమిచ్చింది. ఈ ఇద్దరు ముద్దుగుమ్మల గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ చిత్రానికి శాశ్వత సచైవ్ సంగీతం అందించారు. JA ఎంటర్టైన్మెంట్, ఎకె ప్రొడక్షన్స్, పెన్ ఇండియా లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa