ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం భీమ్లా నాయక్. మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనం కోషియమ్ కు తెలుగు రీమేక్ గా డైరెక్టర్ సాగర్ కే చంద్ర భీమ్లానాయక్ ను తెరకెక్కించారు. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రీఎంట్రీ తరవాత పవన్ ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ యాక్టింగ్, రానా విలనిజం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, పదునైన సంభాషణలు, థమన్ సంగీతం ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్స్.
థియేటర్లలో సందడి ఇంకా ముగియకుండానే ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ఓటిటి యాప్ ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 25 నుండి భీమ్లా నాయక్ మూవీని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీ నుండి టైటిల్ సాంగ్ ఫుల్ వీడియో ను విడుదల చేసారు చిత్రబృందం. రామ్ మిరియాల పడిన ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa