టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ ల పాన్ ఇండియా చిత్రం ఆర్ ఆర్ ఆర్. బాలీవుడ్ నటులు ఆలియాభట్, అజయ్ దేవగణ్ లు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్టుతో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో మార్చి 25న విడుదల కాబోతుంది.
కొన్ని రోజుల నుండి మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా దేశవ్యాప్తంగా టూర్లు వేస్తున్న జక్కన్న,తారక్, రామ్ చరణ్ ల బృందం నిన్న కోల్కతా లో జరిగిన ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్ ఈవెంటులో పాల్గొన్నారు. ఆ తరవాత ఉత్తరప్రదేశ్ లోని పవిత్ర దివ్య క్షేత్రమైన వారణాసిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర గంగా హారతిలో పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులలో, నుదుటున బొట్టు, మెడలో రుద్రాక్షలతో ఉన్న రాజమౌళి, తారక్, రామ్ చరణ్ ల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa