2022 సంక్రాంతి కానుకగా విడుదలైన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ సినిమా సూపర్ మచ్చి. ఆ సమయంలో విడుదలైన రౌడీ బాయ్స్, బంగార్రాజు సినిమాల సందడిలో సూపర్ మచ్చి విడుదలైనట్టు కూడా పెద్దగా ఎవరికీ తెలియదు.
రొమాంటిక్, లవ్ ఎంటెర్టైనర్గా రూపొందిన ఈ సినిమాకి పులి వాసు దర్శకత్వం వహించగా, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రిజ్వాన్ నిర్మించారు. థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియో లో సూపర్ మచ్చి మూవీ ప్రేక్షకులకు అందుబాటులోకొచ్చింది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి, ప్రగతి, అజయ్, షరీఫ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa