ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమా చూస్తూ...అనంతలోకాలకు

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 25, 2022, 06:23 PM

ఆర్ఆర్ఆర్ సినిమా అభిమానుల్లో ఉత్సాహం నింపగా అనంతపురంలో మాత్రం విషాధం నింపింది. అనంతపురంలో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శిస్తుండగా విషాద ఘటన జరిగింది. అంబేద్కర్ నగర్ కు చెందిన ఓబులేసు అనే వ్యక్తి ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తూ ప్రాణాలు వదిలాడు. 30 ఏళ్ల ఓబులేసు థియేటర్లో తన సెల్ ఫోన్లో చిత్రీకరణ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అయితే, అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అతడు అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో అతడి కుటుంబ సభ్యులు, మిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa