బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లి బిజిబిజీగా గడుపుతున్న నటి ప్రియాంక చోప్రా. హాలీవుడ్ సినిమాలతో పాటు, యూఎస్‌లో ప్రసారమయ్యే టెలివిజన్ సిరీస్ ‘క్వాంటికో’లోనూ ఆమె నటిస్తోంది. ఇటీవల ఈ సిరీస్‌లో ఓ ఉగ్రవాదిని భారతీయుడిగా చూపించడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ‘క్వాంటికో’ సిరీస్ నిర్మాతల్ని విమర్శించారు. అంతేకాదు ప్రియాంకను కూడా తప్పుపట్టారు. దీంతో యూఎస్ టెలివిజన్ స్టూడియో ఏబీసీ భారత సినీ అభిమానులకు క్షమాపణలు చెప్పింది.
కాగా, ఇప్పుడు ప్రియాంక చోప్రా తన నోటి తొందరపాటుతో మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. 68వ ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక భారతీయ చిత్రాలపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. భారతీయ చిత్రాలు మొత్తం మహిళల నడుము, శరీర సౌందర్యం చుట్టూ తిరుగుతాయని వ్యాఖ్యానించారు. దీంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయ భాషల్లో పలు అద్భుతమైన చిత్రాల్లో మంచి పాత్రలు దక్కించుకుని ప్రియాంక చోప్రా ఇలా మాట్లాడటం ఏమీ బాగోలేదని మండిపడుతున్నారు. ఇక్కడ మంచి పేరు తెచ్చుకుని హాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత భారతీయ చిత్రాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అంటున్నారు. సత్య జిత్‌రే, రమేష్ సిప్పీ, యశ్‌చోప్రా, హృషీకేశ్ ముఖర్జీ, బీఆర్ చోప్రా వంటి వారు ఎన్నో మంచి చిత్రాలను తీశారని, ఆ సంగతి ప్రియాంక గుర్తించాలని హితవు పలుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa