మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ డెబ్యూ మూవీ విజేత. ఇటీవల చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కాగా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగా అభిమానులు అందరు కళ్యాణ్ దేవ్ లుక్ చూసి ఫుల్ ఇంప్రెస్ అయ్యారు. ఇక తాజాగా టీజర్ విడుదల చేశారు. ఇందులో కళ్యాణ్ దేవ్ లుక్స్‌తో పాటు ఎక్స్‌ప్రెషన్స్ ఆకట్టుకుంటున్నాయి. మురళీ శర్మ హీరో తండ్రి పాత్ర పోషించగా, వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు ప్రేక్షకులచే ఈలలు వేపిస్తాయని టీజర్ బట్టి అర్ధమవుంది. తండ్రి కొడుకుల మధ్య సాగే చిత్రంగా విజేత ఉంటుందని సమాచారం. రాకేశ్ శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజేత చిత్రం తాజాగా టాకీ పార్టును పూర్తిచేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని వేగవంతం చేసి జూలైలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు . హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
విజేత చిత్రంలో ఎవడే సుబ్రహ్మణ్యం’- ‘కళ్యాణ వైభోగమే’ ఫేం మాళవికా నాయర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. కాలేజ్ నేపథ్యంలో కొనసాగే ప్రేమ కథాంశంగా ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘వారాహి’ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాహుబలి" చిత్రానికి తన కెమెరా వర్క్ తో జీవం పోసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. "రంగస్థలం" చిత్రంతో కళా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామకృష్ణ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు తనికెళ్ళభరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల, జయప్రకాష్ (తమిళ నటుడు), ఆదర్ష్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రమ్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. అతి త్వరలోనే చిత్ర ఆడియో వేడుక నిర్వహించనుండగా, ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా హాజరు కానున్నట్టు తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa