ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి రాజ్ తరుణ్ జోడీగా హెబ్బా పటేల్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 12, 2018, 03:28 PM

రాజ్ తరుణ్ .. హెబ్బా పటేల్ జంట యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'కుమారి 21F' .. 'ఈడోరకం ఆడోరకం' సినిమాలు విజయాలను అందుకున్నాయి. ఆ తరువాత ఈ జోడీ కలిసి నటించిన 'అంధగాడు' మాత్రం నిరాశ పరిచింది. అయితే మరోమారు ఈ జంట కలిసి నటించనుందనేది తాజా సమాచారం.


కొంతకాలం క్రితం తమిళంలో వచ్చిన 'నానుమ్ రౌడీ దాన్' మూవీకి ఇది రీమేక్. విజయ్ సేతుపతి .. నయనతార జంటగా విఘ్నేశ్ శివన్ తెరకెక్కించిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. అలాంటి ఈ సినిమాను నిర్మాత సి.కల్యాణ్ తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ జోడీగా హెబ్బా పటేల్ ను తీసుకున్నారు. కొంతకాలంగా ఇటు రాజ్ తరుణ్ .. అటు హెబ్బా పటేల్ ఇద్దరూ కూడా సక్సెస్ లు లేక డీలా పడ్డారు. ఈ ఇద్దరికీ ఈ సినిమా సక్సెస్ ను ఇస్తుందేమో చూడాలి.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa